ETV Bharat / state

మరీ ఇంత నిర్లక్ష్యమైతే ఎలా? - lock down latest news

లాక్​డౌన్​ సడలింపులతో ప్రజలు బ్యాంకుల వద్దకు పరుగులు తీస్తున్నారు. భౌతిక దూరం మాటే మరిచిపోతూ.. క్యూలు కడుతున్నారు. దూరం మరిచి లైన్లలో నిలుచుంటున్నారు. ఇంకొంతమంది కనీసం మాస్కులు సైతం ధరించకపోవడం.. ఆందోళన కలిగిస్తోంది.

people dont follow the lock down
సామాజిక దూరం మరిచి బ్యాంకుల వద్ద బారులు తీరిన జనం
author img

By

Published : May 11, 2020, 2:08 PM IST

నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలో బ్యాంకుల వద్ద ప్రజలు గుంపులుగా చేరడంపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం ప్రభుత్వాలు లాక్ డౌన్ అమలు చేస్తున్న దశలో ప్రజలు బ్యాంకులకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. చాలా మంది భౌతిక దూరాన్ని పట్టించుకోవడం లేదు.

లాక్​డౌన్​ ఆంక్షలకు సడలింపులు ఇవ్వడానికి.. సోమవారం కావడం వల్ల ఎక్కువ మంది ఖాతాదారులు బ్యాంకు, ఏటీఎంల వద్దకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కొన్ని బ్యాంకుల సిబ్బంది సైతం సరైన ఏర్పాట్లు చేయని కారణంగా.. జనం క్యూలో నిలబడ్డారు. కొందరు కనీసం మాస్కులు సైతం ధరించకుండా బ్యాంకులకు వచ్చారు.

ఈ పరిస్థితిపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు చొరవ తీసుకుని బ్యాంకులు, ఏటీఎంలకు వచ్చేవారు భౌతిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఇవీ చూడండి:

నెల్లూరులోని రసాయన పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.