ETV Bharat / state

కృష్ణపట్నం చేరుకున్న ఆక్సిజన్ ఎక్స్​ప్రెస్

author img

By

Published : May 15, 2021, 7:09 PM IST

రాష్ట్రంలో ఆక్సిజన్ అవసరాల దృష్ట్యా పశ్చిమ్బం​గ నుంచి బయలుదేరిన ఆక్సిజన్ ఎక్స్​ప్రెస్... కృష్ణపట్నం చేరుకుంది. 27 గంటల్లోనే ఈ రైలు గమ్యస్థానానికి చేరినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.

oxygen-express-reached-krishnapatnam
కృష్ణపట్నం చేరుకున్న ఆక్సిజన్ ఎక్స్​ప్రెస్

రాష్ట్ర అవసరాలు తీర్చేందుకు పశ్చిమ్బం​గ నుంచి రాష్ట్రానికి బయల్దేరిన ఆక్సిజన్ ఎక్స్​ప్రెస్ కృష్ణపట్నం చేరుకుంది. రెండు కంటైనర్లలో 40 మెట్రిక్ టన్నుల ద్రవరూప మెడికల్ ఆక్సిజన్​ను తీసుకువచ్చిన ఈ రైలు... 27 గంటల్లో గమ్యస్థానానికి చేరుకున్నట్లు అధికారులు వెల్లడించారు. రైల్వే గ్రీన్ కారిడార్​ను ఏర్పాటు చేయడం వల్ల ఈ రైలు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిందని వివరించారు. ఈ నెలాఖరులో 76.39 టన్నుల మెడికల్ ఆక్సిజన్ ఎక్స్​ప్రెస్ నాలుగు కంటైనర్ ట్యాంకర్లతో గుంటూరుకు చేరుకుంటుందని రైల్వే శాఖ అంచనా వేస్తోంది.

ఇదీచదవండి.

కడప జిల్లాలో ఎర్రచందనం దొంగల హల్‌చల్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.