ఎర్రచందనం అక్రమ రవాణా జరగకుండా పటిష్టమైన నిఘా కొనసాగించాలని జిల్లా అటవీశాఖాధికారి షణ్ముఖ కుమార్ ఉదయగిరి రేంజ్ అటవీశాఖ సిబ్బందికి సూచించారు. రేంజ్ పరిధిలోని కొత్తపల్లి, శకునాల పల్లి, దేవమ్మ చెరువు అటవీశాఖ బీట్ లలో రేంజ్ అధికారి ఉమా మహేశ్వర్ రెడ్డి తన సిబ్బందితో కలసి 9 కిలోమీటర్లు కూంబింగ్ నిర్వహించారు. అడవిలో ఎర్రచందనం వృక్షాలు ఎక్కువగా ఉండే పలు ప్రాంతాలను ఆయన పరిశీలించారు.
కలివేల ఊటు, సాకుటూ బేస్ క్యాంపులను సందర్శించారు. అటవీశాఖ సిబ్బంది తమ ప్రాంతాల పరిధిలోని అడవులపై నిత్యం పర్యవేక్షణ చేస్తూ ఎర్రచందనం అక్రమంగా తరలిపోకుండా అన్ని జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఉమా మహేశ్వర్ రెడ్డితోపాటు .. సీతారామపురం డిప్యూటీ రేంజ్ అధికారి ఖాజా రసూల్, ఉదయగిరి ఫారెస్ట్ సెక్షన్ అధికారి ప్రసాద్, పలువురు ఎస్బివోలు ఉన్నారు.
ఇదీ చదవండి: