ETV Bharat / state

లాక్​డౌన్​ ప్రభావంతో నెల్లూరు ప్రజల ఇక్కట్లు

నెల్లూరులో కరోనా ప్రభావంతో రహదారులు ఖాళీగా దర్శనమిచ్చాయి. మార్కెటింగ్​ శాఖ వారు రైతు బజార్లను 2 డివిజన్లుగా ఏర్పాటు చేశారు. అత్యవసర పనుల్లో బయటకు వెళ్తున్న వారికి మాజీ మున్సిపల్​ కౌన్సిలర్​ విశ్వనాథం తన వంతు సాయం అందించారు.

nellore district people suffering due to corona lockdown
నెల్లూరు జిల్లాలో లాక్​డౌన్​ ప్రభావం
author img

By

Published : Mar 29, 2020, 8:31 PM IST

నెల్లూరు రైతు బజార్లు

నెల్లూరు నగరంలో మార్కెటింగ్​ శాఖ ఆధ్వర్యంలో.. 54 డివిజన్లలో 110 రైతు బజార్లు ఏర్పాటు చేశారు. డివిజన్​కు రెండు చొప్పున రైతు బజార్లను ఏర్పాటు చేయడం వల్ల ప్రజలు ప్రశాంతంగా కూరగాయలు కొనుగోలు చేశారు. ప్రభుత్వం సూచించిన 3 అడుగుల దూరం నిబంధనను పాటించారు. లాక్​డౌన్​ నేపథ్యంలో నగరంలోని రహదారులు ఖాళీగా దర్శనమిచ్చాయి. మాస్క్​లు ధరించకుండా మోటార్​ సైకిళ్లపై తిరుగుతున్న ప్రజలకు పోలీసులు అవగాహన కల్పించారు.

నెల్లూరు సిటీ

వెంకటగిరిలో మాజీ మున్సిపల్​ కౌన్సిలర్​ విశ్వనాథం ఉదారత చాటుకున్నారు. క్రాస్​ రోడ్డు కూడలిలో వ్యవసాయ పనులకు ఇతర అత్యవసర కార్యక్రమాలకు వెళ్తున్న వారికి భోజన పొట్లాలను పంపిణీ చేశారు.

వెంకటగిరి

ఇదీ చదవండి:

వెంకటగిరిలో ప్రజలకు పాలు, గుడ్లు పంపిణీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.