నెల్లూరులో ఈ నెల 17వ తేదీన షేక్ బాషా హత్య కేసును పోలీసులు చేధించారు. సీఏఎం హై స్కూల్ ప్రాంతంలోని వాచ్ మెన్ షెడ్ లో షేక్ బాషా తో పాటు అతని స్నేహితులు అయిదుగురు మద్యం సేవించారు. మత్తులో జారుకున్న తర్వాత షేక్ బాషాను స్నేహితులు కత్తులతో పొడిచి చంపి పరారయ్యారు.
కేసు నమోదు చేసిన పోలీసులు.. స్నేహితులే ఈ హత్యకు పాల్పడినట్లు నిర్ధరించారు. హత్యకు పాల్పడిన సయ్యద్ మొహసిన్ అహ్మద్, జాన్సన్, సమీర్, ఫారుఖ్, ప్రేమ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సయ్యద్ మొహసిన్ అహ్మద్, షేక్ బాషా మధ్య ఇటీవల గొడవలు జరగడమే ఈ హత్యకు దారి తీసినట్టు సీఐ మధుబాబు తెలిపారు.
ఇదీ చదవండి: