నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఎమ్ఎస్ఎమ్ఈ పార్కుకు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆదివారం శంకుస్థాపన చేశారు. దీని ద్వారా ప్రత్యక్షంగా 2వేల మందికి ఉద్యోగావకాశాలు దక్కనున్నాయని మంత్రి వెల్లడించారు. ఈ ఎమ్ఎస్ఎమ్ఈ పార్కును 400 కోట్ల రూపాయలతో అత్యున్నత హంగులతో త్వరలోనే అభివృద్ధి చేస్తామని తెలిపారు. మొత్తం 173 ఎకరాల్లో పార్కు నిర్మాణం చేపడుతుండగా... మొదటి దశలో 87 ఎకరాల్లో అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.
ఇదీ చదవండి