నెల్లూరులోని అయ్యప్పగుడి జాతీయ రహదారిపై మద్యం లోడు లారీ ప్రమాదానికి గురైంది. మద్యం లోడుతో వెంకటాచలం వైపు నుంచి గుంటూరు వైపు వెళ్తున్న లారీ- క్రేన్‌ను ఢీకొట్టి పక్కనే ఉన్న కారుపై పడింది. ప్రమాదంలో కారు ధ్వంసం కాగా.. లారీలోని మద్యం సీసాలు రోడ్డుపై పడ్డాయి. దీంతో కొందరు స్థానికులు అందినకాడికి మద్యం బాటిళ్లను పట్టుకెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు, ఎక్సైజ్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మిగిలిన మద్యం సీసాలను భద్రపరిచారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి..