యువజన శ్రామిక రైతు పార్టీ అని పేరు పెట్టుకొని ఆయా వర్గాలకు ముఖ్యమంత్రి జగన్ తీరని అన్యాయం చేశారని తెలుగుదేశం పార్టీ విమర్శించింది. ఉద్యోగాల్లేక యువకులు, పనుల్లేక కార్మికులు, గిట్టుబాటు ధర లేక రైతులు ఎన్నో కష్టాలు పడుతున్నారని తెదేపా నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ విమర్శించారు.
నెల్లూరు రూరల్ మండలం పాత వెల్లంటి గ్రామానికి చెందిన వైకాపా, జనసేన పార్టీల నుంచి 33 కుటుంబాల వారు తెదేపాలో చేరారు. తెదేపా జిల్లా కార్యాలయంలో అబ్దుల్ అజీజ్, నగర ఇన్ఛార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరుపై అజీజ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
పెట్టుబడులు లేక, పరిశ్రమల రాక నిరుద్యోగంతో యువత బాధపడుతున్నారన్నారు. 4 లక్షల వాలంటరీ ఉద్యోగాలు ఇచ్చామంటూ, ఉన్నత చదువులు చదువుకున్న వారిని వీధులకే పరిమితం చేశారని దుయ్యబట్టారు. ఇసుక పాలసీ తీసుకొచ్చి కార్మికులకు పూట గడవని పరిస్థితికి తీసుకొచ్చారని విమర్శించారు. రైతులకు సరైన గిట్టుబాటు ధర ఇవ్వకపోగా తేమ శాతం పేరుతో 30 శాతం అదనంగా ధాన్యం తీసుకోవడం దారుణమన్నారు.
ఇవీ చదవండి..