నెల్లూరు నగరం బోడిగాడి తోట వద్ద అగ్ని ప్రమాదం జరిగింది. బాలాజీ కెమికల్స్ గోదాములో ఉదయం ఆకస్మాత్తుగా మంటలు చెలరేగటంతో.. ఒకరు గాయపడగా.. 20మందిని అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. కెమికల్ పొగ పీల్చటంతో.. ఎనిమిది మందిని ఆసుపత్రికి తరలించారు. మూడంతస్తుల భవనంలో.. పైన నివాసాలు ఉండగా.. కింద అనుమతులు లేకుండా కెమికల్ గోదాము నిర్వహిస్తున్నారు. గోదాములోని అగ్నిప్రమాదంతో.. కెమికల్స్ తోపాటు, సామాగ్రి అగ్నికి ఆహుతైంది. భవనంపై అంతస్థులో నివసిస్తున్న వారు.. మంటల కారణంగా వ్యాపించిన పొగకు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది 4 అగ్నిమాపక శకటాలతో మంటలను అదుపు చేశారు.
ఇవీ చూడండి...