ETV Bharat / state

Power Cuts In Nellore: వేళాపాళా లేని కోతలు.. ఇలాగైతే తడిసేదేలా! - ap latest news

Power Cuts In Nellore: వేళాపాళా లేని కరెంటు కోతలు.! బల్బు ఎప్పుడు వెలుగుతుందా..పొలాలకు నీళ్లెప్పుడు వదులుదామా అని ఎదురుచూపులు..! పని పూర్తయ్యాక ఇంటికెళ్తే..నిద్రొచ్చేలోపే వరుసకోతలు..! ఇలా...విద్యుత్ విరామాలతో...పొలం తడవదు...ఇంట్లో నిద్రలేదంటున్నారు నెల్లూరు జిల్లా రైతులు.

Power Cuts
Power Cuts
author img

By

Published : Apr 13, 2022, 5:34 AM IST

Power Cuts In Nellore: నెల్లూరు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఎడాపెడా కరెంట్ కోతలతో రైతులు అల్లాడుతున్నారు. ఎప్పుడు పడితే అప్పుడు కోతలతో...పంటలు తడిపేందుకు 24 గంటలూ మీటరు వైపే చూడాల్సి వస్తోంది. ఇందుకూరుపేట, సర్వేపల్లి, వెంకటాచలం, బోగోలు, వరికుంటపాడు వరకూ అన్ని మండలాల్లో ఇదే పరిస్థితి.

వేళాపాళా లేని కోతలు.. ఇలాగైతే తడిసేదేలా!

తడిసిన చోటే మళ్లీ: ఉదయగిరి, ఆత్మకూరు ప్రాంతాల్లో మెట్టపైర్లు ఉన్నాయి. పొదలకూరు ప్రాంతాల్లో రైతులు నిమ్మతోటలు సాగుచేస్తున్నారు. ఎకరా తడవాలంటే కనీసం ఆరుగంటలు ఏకదాటిగా విద్యుత్ మోటార్లు పనిచేయాలి. అయితే వేళాపాళాలేని కరెంట్ కోతలతో.....పంట తడిసిన చోటే మళ్లీ తడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఛార్జీల పెంపుతో బాదితే బాదారు...కనీసం కోతల్లేకుండా పని చేసుకోనివ్వాలని రైతులు అంటున్నారు.

తీవ్ర ఎండలో రెక్కలు ముక్కలు చేసుకుని సాయంత్రం ఇంటికి వస్తే.. నిద్రపట్టేసరికి రాత్రి సమయాల్లో రెండుమూడు సార్లు కరెంటు కోతలు. దోమల మధ్యే నిద్రపోవాల్సి వస్తోందంటూ రైతులు వాపోతున్నారు. మరోవైపు కరెంట్ కోతలతో విద్యార్థుల చదువులూ అటకెక్కుతున్నాయని తల్లిదండ్రులు అంటున్నారు.

ఇదీ చదవండి: పరిశ్రమలపై మరో పిడుగు... విద్యుత్‌పై సుంకం పెంపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.