వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరుల చేతుల్లో గాయపడ్డ టిఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు తిరుమల నాయుడిని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరామర్శించారు. వైకాపా నాయకులు రౌడీలుగా మారుతున్నారని మండిపడ్డారు. కేసులు ఉన్నవారికే ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిన జగన్....నెల్లూరు జిల్లాను మరో పులివెందులుగా మార్చబోతున్నారని సోమిరెడ్డి ధ్వజమెత్తారు. తెలుగుదేశం నాయకుల జోలికొస్తే సహించేది లేదని తెలిపారు. మోదీ కనుసన్నల్లో ఎన్నికల సంఘం పని చేస్తుందని ఆరోపించారు.
మోదీ కనుసన్నల్లో ఎన్నికల సంఘం: మంత్రి సోమిరెడ్డి - minister
నెల్లూరులోని సింహపురి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టిఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు తిరుమలనాయుడును మంత్రి సోమిరెడ్డి పరామర్శించారు. వైకాపా కార్యకర్తలు నెల్లూరును మరో పులివెందులుగా చేశారని వాపోయారు. మోదీతో జతకట్టి కావాల్సిన వారిని బదిలీ చేయించుకున్నారని ఆరోపించారు.