నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి రైతులు సంతోషిస్తున్నారు. కానీ, విద్యార్థులకు మాత్రం కష్టాలు ఎదురయ్యాయి. ఆత్మకూరు మండలం గొల్లపల్లి, వాశిలి గ్రామాల్లోని ఉన్నత పాఠశాల ఆవరణలో భారీగా నీరు చేరడంతో పిల్లలు లోపలికి వెళ్ళాలంటే నానా ఇబ్బందులు పడ్డారు. కొద్దిపాటి వర్షానికే పాఠశాలలోకి నీరు చేరటంతో పిల్లలను స్కూల్కు పంపాలంటేనే తల్లితండ్రులు భయపడుతున్నారు. ఇటీవల జాతియ రహదారి ఎత్తు పెంచడం వల్ల పాఠశాలలోకి నీరు చేరుతుందని గ్రామస్ధులు ఆరోపిస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ఏ మాత్రం చలనం లేదని ఉపాధ్యాయులు, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి మిస్సింగ్ రెయిన్బోలో.. మిస్ల సందడి