డీఎస్పీ ఆదేశాలతో.. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో కర్ఫ్యూ అమలు తీరును సీఐ వేణుగోపాల్ రెడ్డి, ఎస్సై సంతోష్ కుమార్ రెడ్డి పర్యవేక్షించారు. సాయంత్రం 6 గంటల నుంచి పోలీసు సిబ్బంది దుకాణాలను మూయించారు. కర్ఫ్యూ అమలుపై ఆత్మకూరు డీఎస్పీ వెంకటేశ్వరరావు సీఐ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ..కర్ఫ్యూ నిబంధనలో భాగంగా ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు జనతా కర్ఫ్యూ అమల్లో ఉంటుందని.. ప్రతి ఒక్కరూ సాయంత్రం 6 గంటలలోపు తమ పనులను ముగించుకోవాలని సూచించారు.
వైద్యం, అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని, మాస్కులు ప్రతి ఒక్కరూ ధరించాలని తెలిపారు. అకారణంగా తిరిగితే వారికి జరిమానా విధించనున్నట్లు తెలిపారు. ప్రజా ఆరోగ్య దృష్ట్యా ప్రభుత్వం తీసుకుంటున్న కర్ఫ్యూ నిబంధనలను తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఆచారించాలని డీఎస్పీ వెంకటేశ్వర రావు కోరారు. ఈ సమావేశంలో ఆత్మకూరు సీఐ వేణుగోపాల్ రెడ్డి, ఎస్సై సంతోష్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
ఇదీ చదవండి: