ETV Bharat / state

'జూలైలోగా పనులు పూర్తి చేయాలి' - manabadi nadu nedu latest news in balayapalli

నెల్లూరు జిల్లా బాలాయపల్లిలో మనబడి 'నాడు-నేడు' కార్యక్రమంపై పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, గ్రామ సచివాలయాల ఇంజినీరింగ్ సహాయకులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జూలై లోగా 'నాడు-నేడు' పథకంలో ఎంపికైన పాఠశాలల అభివృద్ధి పనులు పూర్తి చేయాలని పంచాయతీరాజ్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సూచించారు.

మనబడి నాడు నేడు కార్యక్రమంపై అవగాహన కార్యక్రమం

author img

By

Published : Jun 5, 2020, 6:58 PM IST

నెల్లూరు జిల్లా బాలాయపల్లిలో మనబడి 'నాడు-నేడు' కార్యక్రమంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, గ్రామ సచివాలయాల ఇంజనీరింగ్ సహాయకులకు పంచాయతీరాజ్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కాంతారావు పలు సూచనలు చేశారు. జూలై నెలలోగా 'నాడు-నేడు' పథకంలో ఎంపికైన పాఠశాలల అభివృద్ధి పనులు పూర్తి చేయాలని సూచించారు. ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణలో నిర్మాణాలు నాణ్యతగా జరిగేలా దృష్టిసారించాలని తెలిపారు. నిర్ణీత గడువులోగా పూర్తి చేయడమే లక్ష్యంగా కృషి చేయాలని కోరారు. మండలంలో తొలి విడత కార్యక్రమంలో 21 పాఠశాలలు ఎంపికైన సందర్భంగా ఈ పనులను వేగవంతం చేయాలని డీఈ విజయ్ కుమార్ పేర్కొన్నారు.

ఇదీ చూడండి: 'ఐదేళ్లలో 30 లక్షల ఇళ్లు నిర్మించటమే లక్ష్యం'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.