నెల్లూరు జిల్లా నాయుడుపేట పురపాలక సంఘం పరిధిలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. పట్టణంలో పరిశుభ్రత చర్యలు తీసుకుంటున్నారు. స్థానిక బీడీ కాలనీ వాసికి పాజిటివ్ తేలగా.. నెల్లూరులో చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే నాయుడుపేట నుంచి దిల్లీ వెళ్లొచ్చిన 21 మందితో పాటుగా 15మందిని క్వారంటైన్ సెంటర్లో ఉంచారు. పట్టణంలో మరో కరోనా పాజిటివ్ అని తెలుసుకున్న ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
ఇదీ చూడండి: