నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం తిక్కవరం గ్రామంలోని ఫ్యూషన్ బ్లాక్స్ వెయిట్ లెస్ బ్రిక్స్ ఫ్యాక్టరీలో నల్లయగారిపాలెం గ్రామానికి చెందిన తాళ్లపాక చిన పెంచలయ్య (47) పనిచేస్తున్నాడు. వారం రోజుల క్రితం ఓ కంపెనీకి బ్రిక్స్ పంపిణీ చేసేందుకు ఆయన చెన్నై వెళ్లారు. అయితే శుక్రవారం వారి కుటుంబసభ్యులకు ఫ్యాక్టరీ యాజమాన్యం ఫోన్ చేసి పెంచలయ్యకు ఓ ప్రమాదంలో గాయాలయ్యాయి అని చెప్పారు. బ్రిక్స్ని దించే క్రమంలో అవి అతని మీద పడి గాయపడ్డాడని వారికి వెల్లడించారు. చెన్నైలోని ప్రభుత్వ వైద్యశాలలో పెంచలయ్యను చేర్పించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబ సభ్యులు చెన్నైకు వెళ్లి మృతదేహాన్ని ఆదివారం తీసుకువచ్చారు. యాజమాన్యం బాధ్యతా రహితంగా వ్యవహరించిందని ఫ్యాక్టరీ వద్ద మృతదేహంతో బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆందోళనకు దిగారు. పెంచలయ్య కుటుంబానికి పరిహారం చెల్లించే వరకు కదిలేది లేదని నిరసనకు దిగారు. మృతిపై బాధిత కుటుంబీకులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి ఇంద్రకీలాద్రికి మంత్రి ధర్మాన కృష్ణదాస్