ETV Bharat / state

జింక.. అలా జారిపడింది.. ఇలా చెంగుచెంగున బయటపడింది!

author img

By

Published : Jun 17, 2021, 12:19 PM IST

నీరు తాగేందుకు వచ్చిన ఓ జింక కాలుజారి కాలువలో పడిపోయింది. నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం చిలకలమర్రి గ్రామ సమీపంలోని సోమశిల జలాశయ కాలువలో ఈ ఘటన జరిగింది.

deer
జింక

జింక

నీరు తాగేందుకు వచ్చిన ఓ జింక పొరపాటున సోమశిల ఉత్తర కాలువలో జారి పడిపోయింది. నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం చిలకలమర్రి గ్రామ సమీపంలో ఈ ఘటన జరిగింది. చుక్కల దుప్పి నీరు తాగేందుకు వచ్చి ప్రమాదవశాత్తు కాలుజారి కాలువలో పడింది.

అక్కడ నుంచి బయటికి రాలేక ఎగురుతూ ఉండగా.. కొందరు స్థానికులు గమనించి రక్షించేందుకు యత్నించారు. చివరికి.. ఎక్కువ ఎత్తుకు ఎగురుతూ తనకు తానుగానే ఆ జింక బయటపడింది. ఈ దృశ్యాలను అక్కడున్న కొందరు యువకులు తమ సెల్ ఫోన్లలో చిత్రీకరించారు.

ఇదీ చదవండి:

గజ్వేల్​లో భాజపా జెండా ఎగురవేస్తా: ఈటల రాజేందర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.