ETV Bharat / state

ఆంధ్రా-తెలంగాణ సరిహద్దులో భారీగా గుట్కా పట్టివేత

author img

By

Published : Jan 4, 2023, 7:42 PM IST

Police Seized a Huge Gutka : ఆంధ్రా-తెలంగాణ సరిహద్దులో పొందుగుల బోర్డర్ వద్ద నిన్న 672 బ్యాగుల గుట్కాను పట్టుకున్నట్లు పల్నాడు జిల్లా అసిస్టెంట్ ఎన్​ఫోర్స్​మెంట్​ సూపరింటెండెంట్ డీ.ఎస్.దుర్గాప్రసాద్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం నుంచి వస్తున్న లారీని ఆపి తనిఖీ చేయగా అందులో భారీగా గుట్కాను గుర్తించామని వీటి విలువ సుమారు 12 లక్షల రూపాయలు ఉంటుందని అన్నారు. గుట్కాతో పాటు 5కేసుల తెలంగాణ మద్యాన్ని కూడా గుర్తించామని పేర్కొన్నారు.

Huge Gutka
భారీ గుట్కా

Police Seized a Huge Gutka : ఆంధ్రా-తెలంగాణ సరిహద్దు పొందుగుల బోర్డర్ వద్ద భారీ స్థాయిలో గుట్కాను పట్టుకున్నట్లు పల్నాడు జిల్లా అసిస్టెంట్ ఎన్​ఫోర్స్​మెంట్​ సూపరింటెండెంట్ డి.ఎస్. దుర్గాప్రసాద్ తెలిపారు. పల్నాడు జిల్లా గురజాల పట్టణంలోని స్థానిక ఎక్సైజ్ కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. తెలంగాణ రాష్ట్రం నుంచి వస్తున్న లారీని ఆపి తనిఖీ చేయగా.. అందులో భారీగా గుట్కా ఉన్నట్లు గుర్తించామన్నారు. అలాగే 5కేసుల తెలంగాణ మద్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ఘటనలో లారీలో ఉన్న 672 బ్యాగుల గుట్కాతో పాటు లారీని, డ్రైవర్, క్లీనర్​ను అదుపులో తీసుకున్నట్లు పేర్కొన్నారు.

స్వాధీనం చేసుకున్న గుట్కా విలువ సుమారు 12 లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు. తరలిస్తున్న వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఇలా గుట్కా, మద్యం తరలించటం నేరమని, అలా తరలించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.