ETV Bharat / state

రాజధాని అమరావతి అంశం..సుప్రీం వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఏమన్నారంటే..!

YSRCP on Amaravati SC verdict : సుప్రీంకోర్టు రాజధాని అంశంపై ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. న్యాయపరంగా ఉన్న సమస్యలు అధిగమించిన తర్వాత మూడు రాజధానుల ప్రక్రియను ప్రారంభిస్తామని రాష్ట్రమంత్రులు పేర్కొన్నారు.

ysrcp
వైసీపీ
author img

By

Published : Nov 28, 2022, 10:37 PM IST

YSRCP on Amaravati SC verdict: రాజధాని అమరావతి అంశంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలను స్వాగతిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మూడు రాజధానులపై ప్రభుత్వ నిర్ణయం సహజన్యాయానికి అనుగుణంగా ఉందని ప్రభుత్వ సలహాదారు సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. వికేంద్రీకరణకు చట్టబద్ధత కల్పించాక వరుసగా జరిగిన ఎన్నికల్లో ప్రజలు వైసీపీని గెలిపించారని అన్నారు. మూడు రాజధానుల విషయంలో మిగిలిన అడ్డంకుల్ని సైతం అధిగమించి త్వరలోనే ముందుకెళ్తామని మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి స్పష్టం చేశారు. అమరావతిలో రైతుల భూముల అభివృద్ధిపై హైకోర్టు గతంలో నిర్దిష్ట కాలపరిమితి విధించిందని.. హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు ఈరోజు స్టే ఇచ్చిందని అన్నారు.

సుప్రీం వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఏమన్నారంటే

"సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వం చెప్తున్న మాటలే. వాటిని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. చిత్తశుద్ధి ఉంటే ఎక్కడ కూర్చోనైనా పాలన కొనసాగించవచ్చు. మూడు రాజధానుల అంశం ప్రభుత్వ విధానం.. దానిపైన పునరాలోచన లేదు. ఏమైనా మార్పులు చేర్పులుంటే ముఖ్యమంత్రి మంత్రి వర్గంతో చర్చించి తీసుకుంటారు. " - బొత్స సత్యనారాయణ, మంత్రి

రాజ్యంగానికి విరుద్ధంగా ఏమైనా చేస్తే పరిశీలించటానికి న్యాయ వ్యవస్థ ఉంది. వికేంద్రీకరణ గ్రామ స్థాయి నుంచి మొదలుపెట్టి జిల్లా స్థాయి వరకు జరిగింది. రాష్ట్ర స్థాయిలో మూడు ప్రాంతాలకు సమన్యాయం చేసే విధంగా.. అధికారంలో వాటా కల్పిస్తూ ప్రజల అకాంక్షను ప్రతిబింబించేలా తీసుకున్న నిర్ణయానికి మద్దతు ఉంది. న్యాయ వ్యవస్థపరంగా ఉన్న చిన్న చిన్న అడ్డంకులు తొలగుతాయని అశిస్తున్నాము." -సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు

రాజధానికి సంబంధించిన సమస్యలను ఒక్కొక్కటిగా అధిగమిస్తాం. సమస్యలన్నీ అధిగమించిన వెంటనే మూడు రాజధానుల ప్రక్రియ ప్రారంభం అవుతుంది." - కాకాణి గోవర్ధన్​ రెడ్డి, మంత్రి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.