ETV Bharat / state

పేదల ఇళ్ల నిర్మాణంపై చేతులెత్తేసిన జగన్‌ సర్కారు-రూ.800 కోట్లు దారి మళ్లింపు! - CM Jagan comments

YS Jagan Govt Raised Hands on Poor People House Construction: ఇళ్లు కాదు, ఊళ్లు నిర్మిస్తున్నామని ప్రగల్భాలు పలికిన వైఎస్సార్​సీపీ ప్రభుత్వంపై పేదలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 25 లక్షల ఇళ్లు కట్టి, చూపిస్తానన్న ముఖ్యమంత్రి జగన్ మాటలు ఏమైయ్యాయని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. ఇంటి స్థలాలను నివాస యోగ్యం కాని ప్రాంతాల్లో ఇచ్చి, తమను తీవ్ర అవస్థలకు గురి చేస్తున్నారని లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు.

jagan_govt_raised_hands_on_poor_house_construction

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 20, 2023, 9:16 AM IST

పేదల ఇళ్ల నిర్మాణంపై చేతులెత్తేసిన జగన్‌ సర్కారు-రూ.800 కోట్లు దారి మళ్లింపు!

YS Jagan Govt Raised Hands on Poor People House Construction: 'మనం కడుతున్నది ఇళ్లు కాదు-ఊళ్లు నిర్మిస్తున్నాం' అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పలు బహిరంగ సభల్లో పలికిన మాటలపై పేద ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ పాలనలో 25 లక్షల ఇళ్లు కట్టి, చూపిస్తానన్న ముఖ్యమంత్రి మాటలు ఏమైయ్యాయని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను పక్కదారి పట్టించి, వారి ఆశలపై నీళ్లు చల్లిన జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంటి స్థలాలను నివాస యోగ్యం కాని ప్రాంతాల్లో ఇచ్చి, తమను తీవ్ర అవస్థలకు గురి చేశారని లబ్ధిదారులు వాపోతున్నారు.

పేదలకు 25 లక్షల ఇళ్లు కట్టిస్తా: ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నారు మన పెద్దలు. వాటిలోని సాధకబాధకాలు అలా ఉంటాయి మరి. అవన్నీ తెలుసో, లేదో కానీ తాను మాత్రం 25 లక్షల ఇళ్లు కట్టిస్తా చూడండి అన్నారు వైఎస్ జగన్‌. అది నిజమేనని నమ్మి, రాష్ట్ర ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూశారు. ఇల్లిదిగో చూడు, అల్లదిగో చూడు అని చెబుతూనే నాలుగున్నరేళ్లు గడిపేశారు. చెప్పిన వాటిలో పావు వాటా కూడా పూర్తి చేయలేదు!. కట్టించేశామని చెబుతున్నవన్నీ పూర్తిగా అందుబాటులోకి రాలేదు. ఇందులో విచిత్రమేమిటంటే, గృహాల నిర్మాణానికి ఇవ్వాల్సిన నిధుల్లో అధిక భాగం కేంద్రం ఎప్పుడో రాష్ట్రానికి ఇచ్చేసింది. ఇక, తెలియనిదేముంది అప్పు కోసం ఎదురుచూసేవాడి చేతిలో డబ్బు మూట పడినట్లయింది. వాటినీ జగనన్న పక్కదారి పట్టించారు. ఇప్పుడు రాష్ట్రంలో ఏ జగనన్న కాలనీకి వెళ్లినా, పునాదులు, మొండిగోడలే దర్శనమిస్తున్నాయి. ఇక జగన్‌ చెప్పడానికీ, జనం వినడానికీ ఏం మిగల్లేదు!

ముంపు ప్రాంతాల్లో జగనన్న కాలనీలు - వర్షాలొస్తే నరకం కనిపిస్తోందంటున్న లబ్దిదారులు

ఇళ్లు పూర్తిచేయలేక చేతులెత్తేసిన జగన్ సర్కార్: ఇళ్లు కట్టించేది కేంద్రమైతే, 22 లక్షల గృహాలు తానే కడుతున్నట్టుగా సొంత డబ్బా కొట్టుకునేది జగన్‌!. ఇంటి నిర్మాణానికి డబ్బులిచ్చేది కేంద్రమైతే, ఆ నిధుల్ని సక్రమంగా వినియోగించకుండా ఇతర అవసరాలకు మళ్లించేది జగన్‌!. కట్టి చూపిస్తానని గట్టిగా చెప్పినాయన ‘ఇదిగో, అదిగో’ అంటూ గడువులు మారుస్తూ ఇప్పటివరకూ పూర్తి చేసింది 6 లక్షల 15 వేల ఇళ్లే!. వాటిలోనూ బయట వైసీపీ రంగులేసుకుని లోపల వదిలేసినవి బోలెడన్ని. పైగా ఇంటికి స్లాబ్‌ వేసినవాటినీ పూర్తయిన ఇళ్ల జాబితాలో కలిపేసుకున్నారు. ఇలాంటివి వేలల్లోనే ఉన్నాయి. ఎన్నికల ముందు 25 లక్షల గృహాల్ని కట్టిస్తానని ఢాంబికాలు పలికిన జగన్‌ ఎన్నికలు మరో 3 నెలలు ఉన్నాయనగా మిగిలినవి పూర్తి చేయలేక చేతులెత్తేశారు.

జగన్ సర్కార్‌పై గుత్తేదారులు ఆగ్రహం: ఇప్పటికే 6 లక్షల గృహలు పూర్తి చేశాం, ఫిబ్రవరికి మరో 5 లక్షలు పూర్తి చేస్తామని ప్రకటించినా, వాస్తవంగా పేదలు కట్టిన ఇళ్లకు డబ్బులివ్వకుండా నెలల తరబడి ఆపేసింది వైఎస్సార్​సీపీ ప్రభుత్వం. సీఎం సొంత జిల్లాలోనే దాదాపుగా 3 నెలలుగా లబ్ధిదారులకు బిల్లులు పడలేదు. ఆ డబ్బుని అక్కడ ఆప్షన్‌-3 కింద కట్టే గుత్తేదారులకు ఇచ్చారు. విజయనగరం జిల్లాలో 25 కోట్ల మేర బకాయిపెట్టింది. మన్యం జిల్లాలో గిరిజనులు కట్టుకున్న ఇళ్లకూ డబ్బులివ్వలేదు. దాదాపుగా ఇక్కడ 10 కోట్ల రూపాయలు రెండు నెలలుగా చెల్లించలేదు. నెల్లూరు జిల్లాలో చివరి స్టేజీ బిల్లులకు నాలుగైదు నెలలుగా చెల్లింపులు లేవు. అవి ఇదివరకే పూర్తయ్యాయని కేంద్రానికి నివేదించి, వచ్చిన డబ్బుల్ని దేనికి వాడుకున్నారో తెలియదు. ఇప్పుడు చెల్లింపులకు ఆపసోపాలు పడుతున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా 300 కోట్ల రూపాయల బకాయిలున్నాయి. జగన్‌ సొంత జిల్లాలో మినహా ఇతర జిల్లాల్లో చాలా చోట్ల ఆప్షన్‌-3 కింద కట్టే గుత్తేదారులకు బిల్లులు చెల్లింపులు నిలిచిపోయాయి.

లోతట్టు ప్రాంతాల్లో జగనన్న ఇళ్ల నిర్మాణం - నీట మునిగిన కాలనీలు, అవస్థల్లో ప్రజలు

కేంద్ర నిధులను దారి మళ్లించిన వైసీపీ సర్కార్: మరోవైపు కేంద్ర ప్రాయోజిత పథకాలకు కేంద్ర ప్రభుత్వమిచ్చే నిధుల్ని, రాష్ట్ర ప్రభుత్వం ఇతర వాటికి మళ్లించకుండా ఎన్ని నిబంధనలు పెట్టినా జగన్‌ బేఖాతరు చేస్తున్నారు. గృహ నిర్మాణానికిచ్చే నిధుల్నీ తరచూ ఇతర వాటికి వినియోగిస్తున్నారు. ఇటీవల కేంద్రం 11 వందల కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేసింది. ఆ మొత్తాన్ని 27 రోజుల్లో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖకు బదిలీ చేయాల్సి ఉండగా, ఆ గడువు దాటినా ఇప్పటికీ జమ కానట్లు తెలిసింది. ఇందులో 800 కోట్ల మేర ఇలా ఇతర వాటికి మళ్లించింది. ఇదేకాకుండా, కేంద్ర నిధులకు అనుగుణంగా రాష్ట్రవాటాను ఎప్పటికప్పుడు విడుదల చేయాలి. కానీ కేంద్ర నిధుల్నే సర్దుబాటు చేస్తూ తన వాటా నిధుల్ని విడుదల చేయడంలో జాప్యం చేస్తోంది. అలా 200 కోట్ల రూపాయలు పెండింగ్‌లో పెట్టింది.

ఇప్పటివరకు పూర్తి చేసింది 6.15 లక్షల ఇళ్లే!: రాష్ట్ర వ్యాప్తంగా నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ల పథకం కింద ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం 19 లక్షల 13 వేల గృహాలు ప్రారంభించగా, అందులో 8 లక్షల గృహాలు ఇంకా పునాది, అంతకంటే తక్కువస్థాయి దశలోనే ఉన్నాయి. ఇవన్నీ రెండున్నరేళ్లుగా దాదాపుగా ఇదే స్థితిలో ఉన్నాయి. ప్రభుత్వం ఇళ్ల బిల్లుల్ని బకాయిలు పెడుతున్న తాజా పరిస్థితిని చూస్తే ఎన్నికల ముందు వీటి నిర్మాణాలు చేపేట్టేందుకు లబ్ధిదారులెవరూ ముందుకు వచ్చే పరిస్థితి లేదని క్షేత్రస్థాయిలో అధికారులు వాపోతున్నారు. బేస్‌మెంట్‌ స్థాయిలో ఉన్నవి మరో 3 లక్షల 80 వేల ఇళ్లున్నాయి. మొత్తంగా ఇవన్నీ కలిపి 11 లక్షల 80 వేలు. ప్రారంభించిన 19.13 లక్షల గృహాల్లో 61.6 శాతం ఇప్పటికీ బేస్‌మెంట్, అంతకంటే తక్కువస్థాయిలో ఉన్నాయంటే... జగన్‌ పదేపదే చెబుతున్న ఊళ్ల కథ ఎలా ఉందో ఇట్టే తెలిసిపోతుంది. రూఫ్‌ స్థాయిలో లక్షా 4 వేల గృహాలున్నాయి.

బిల్లులు రాక పనులు ఆపేసిన కార్మికులు: 19.13 లక్షల గృహాల్లో 3.34 లక్షల ఇళ్లు ఆప్షన్‌-3 కింద లబ్ధిదారులు ఎంపిక చేసుకున్నవి. వీటిని ప్రభుత్వమే కట్టిస్తామని మూడేళ్ల క్రితం మాటిచ్చింది. వీటిలో ఇప్పటికి పూర్తయింది 50 వేల గృహాలే. రెండున్నర లక్షల గృహాలు బేస్‌మెంట్, అంతకంటే తక్కువ స్థాయిలోనే ఉన్నాయి. అంతో ఇంతో ఇళ్ల నిర్మాణం చేపడుతున్న గుత్తేదారులకు బిల్లుల చెల్లింపులు ఆగిపోయాయి. దీంతో కార్మికులకు సకాలంలో కూలీ చెల్లించని పరిస్థితి. చాలా చోట్ల కార్మికులు పనులు ఆపేసి వెళ్లిపోతున్నారు.

గుట్టల ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు-లబ్ధిదారులు అవస్థలు: ఎక్కువగా కొండలు, గుట్టలు, ఎత్తు పల్లాలున్న చోట లబ్ధిదారులకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలిచ్చింది. ఆ తర్వాత వీటిని చదును చేసేందుకు కోట్లు ఖర్చు పెట్టింది. లేఅవుట్ల చదును కోసం నిబంధనలకు విరుద్ధంగా మొదట్లో ఉపాధి హామీ పథకాన్ని వినియోగించింది. ఉపాధి హామీ పథక నిధుల్ని లేఅవుట్ల చదును కోసం ఎలా వినియోగిస్తారని కేంద్రం తలంటడంతో ఆపేసింది. అప్పటికే చదును చేసిన గుత్తేదారులకు గృహనిర్మాణశాఖ ద్వారా బకాయిలు విడుదల చేస్తామని మాటిచ్చింది. ఇళ్ల నిర్మాణం జరిగే లేఅవుట్ల వరకు చదును చేసిన బిల్లులను విడుదల చేసింది. ఇళ్ల నిర్మాణం చేపట్టని లేఅవుట్లను చదును చేసిన వారికి ఏళ్లు గడుస్తున్నా బకాయిలు చెల్లించడం లేదు.

వైసీపీ సర్కార్‌పై గుత్తేదారులు గగ్గోలు: ఇళ్లు కట్టుకున్న లబ్ధిదారులకు బిల్లులు చెల్లించేందుకే నిధులు లేవని, చదును చేసిన వాటికి ఎక్కడి నుంచి తీసుకురావాలని జిల్లా గృహనిర్మాణశాఖ హౌసింగ్‌ హెడ్‌లు గుత్తేదారులకు చెబుతున్నారు. ఇప్పుడు ఎవరిని అడగాలో కూడా తెలియక గుత్తేదారులు గగ్గోలు పెడుతున్నారు. ఒక్కో గుత్తేదారునికి కోట్లలోనే బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఎన్నికలు దగ్గరపడుతున్నందున.. వారిలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. కాకినాడ, విజయవాడ సహా రాష్ట్రంలో పలుచోట్ల పేదల ఇళ్ల స్థలాల కోసం ఏ మాత్రం అనువుగా లేనిచోట ప్రభుత్వం స్థలాలు కేటాయించింది. దీంతో లబ్ధిదారులు, స్థానికుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

Worst Condition in Jagananna Colonies: చెరువుల్లా జగనన్న కాలనీలు.. జనసైనికుల పడవ ప్రయాణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.