ETV Bharat / state

Water Flow to Barrages in AP: అల్పపీడనం ఎఫెక్ట్​.. జలాశయాలకు వరద.. గోదావరి పరీవాహక ప్రాంతాలకు హెచ్చరిక..! - జలాశయాలకు వరద ప్రవాహం

AP Weather Updates: తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు ఇప్పట్లో బ్రేక్​ పడేలా కనిపించడం లేదు. ఏకధాటిగా కురుస్తున్న వానలకు చెరువులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరద ప్రవాహం పోటెత్తుతుండడంతో ప్రాజెక్టుల్లో నీటిమట్టం పెరుగుతోంది.

Water Flow to Barrages in A
Water Flow to Barrages in A
author img

By

Published : Jul 26, 2023, 4:38 PM IST

అల్పపీడనం ఎఫెక్ట్

AP Weather Updates: ఉత్తర కోస్తాంధ్ర- ఒడిశా తీరాన్ని ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై బలమైన అల్పపీడనం కొనసాగుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీనికి అనుబంధంగా రుతుపవన ద్రోణి, ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నాయని పేర్కొంది. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. కోస్తాంధ్ర జిల్లాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు, రాయలసీమలో చాలా చోట్ల తేలికపాటి నుంచి విస్తారంగా వర్షాలు కురవనున్నట్లు తెలిపింది. రేపటి వరకూ కోస్తాంధ్ర జిల్లాలు, తెలంగాణలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

Rains in Andhra Pradesh: అల్పపీడనం కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో అనకాపల్లి జిల్లా నర్సీపట్నం, ఏలూరు జిల్లా నూజివీడులో అత్యధికంగా 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. ఏలూరు నగరం, అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 10 సెంటీమీటర్ల మేర వర్షం కురిసింది. కృష్ణా జిల్లా నందివాడ, ఏలూరు జిల్లా కుక్కునూరు, పోలవరం లో 9 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదు అయ్యింది.

విజయవాడలో 8 సెంటీమీటర్ల వర్షం పడింది. విశాఖపట్నం, ఏలూరు జిల్లా కొయ్యలగూడెం, అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం, గుంటూరు జిల్లా, శ్రీకాకుళం జిల్లా సోంపేట, కాకినాడ జిల్లా తుని, ఏలూరు జిల్లా కైకలూరు, ఎన్టీఆర్‌ జిల్లా నందిగామలో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. ఇక మరోవైపు రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు.. ఎగువ నుంచి వస్తున్న వరదల కారణంగా పలు జలాశయాల్లోకి వరద ప్రవాహం పెరుగుతోంది.

Water Flow to Dhavaleswaram: రాజమహేంద్రవరం వద్ద గోదావరి వరద ప్రవాహం నెమ్మదిగా పెరుగుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరదల కారణంగా నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటిమట్టం 10 అడుగులకు చేరింది. డెల్టా పంట కాల్వలకు 8 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేయగా.. సముద్రంలోకి సుమారు 7.41 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

Water Flow to Prakasam: అల్పపీడనం కారణంగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రకాశం బ్యారేజీలో పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతోంది. ఈ సాయంత్రానికి సుమారు లక్షన్నర క్యూసెక్కుల మేర వరద నీరు బ్యారేజికి వస్తుందని జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఎగువన తెలంగాణ సహా నందిగామ తదితర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షానికి 80వేల క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజికి వస్తోంది. ఈ నీటిని యథాతథంగా కిందకి విడుదల చేస్తున్నారు. బ్యారేజిలో 70 గేట్ల నుంచి వరద ప్రవాహాన్ని సముద్రంలోకి విడుదల చేసినట్లు జలవనరుల శాఖ స్పష్టం చేసింది.

Water Flow to Polavaram: పోలవరం ప్రాజెక్టులో భారీగా సీపేజీ, లీకేజీ నీరు కాఫర్ డ్యాంల మధ్య చేరింది. పోలవరం స్పిల్ వే నుంచి దాదాపు 7 లక్షల క్యూసెక్కుల వరద నీరు వెళ్తుండటం, ఎగువ నుంచి ప్రవాహాలు పెరగటంతో ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల మధ్య సీపెజీ నీరు వచ్చి చేరింది. ప్రస్తుతం 19.72 మీటర్ల ఎత్తున నీరు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.