KTR inaugurated Bansilalpet step well: భాగ్యనగర చారిత్రక వైభవానికి సజీవ సాక్ష్యాలుగా నిలిచే కట్టడాలను... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ ప్రత్యేక చొరవతో పునరుద్ధరిస్తున్నాయి. బన్సీలాల్‌పేట్‌లో 3 శతాబ్దాల కిందట నిర్మించిన నాగన్నకుంట మెట్లబావికి కొత్త అందాలను అద్దారు. 30.5 మీటర్ల పొడవు, 19.2 అడుగుల వెడల్పు, 53 అడుగుల లోతుతో అప్పట్లో ఈ కట్టడాన్ని నిర్మించారు. దశాబ్దాలుగా నిరాదరణకు గురై, రూపురేఖలు కోల్పోయిన మెట్లబావిని పునరుద్ధరించారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్... ఈ బావిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
సహిత స్వచ్ఛంద సంస్థ సహకారంతో రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ మెట్లబావి పూర్వవైభవానికి చర్యలు చేపట్టింది. మట్టి, చెత్త, వ్యర్థాలతో పూడుకుపోయిన బావిని 8నెలలపాటు శ్రమించి.. రూపురేఖలు మార్చివేశారు. బావుల వద్ద ఆక్రమణల తొలగింపు, చుట్టూ పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి... పర్యాటకులను ఆకర్షించే విధంగా తీర్చిదిద్దారు. పునరుద్ధరణ పనులను మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వచ్చారు. ప్రభుత్వ సహకారాన్ని కొనియాడుతూ.. సహిత స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు.. భావోద్వేగానికి గురయ్యారు.
భూగర్భజలాల సంరక్షణపై మనక్‌కీబాత్‌లో మాట్లాడే క్రమంలో.. ప్రధాని మోదీ ఈ బన్సీలాల్‌పేట మెట్లబావి గురించి ప్రస్తావించారు. చారిత్రక మెట్లబావికి పునర్వైభవం తీసుకొచ్చారని, కాలక్రమేణా మట్టి, చెత్తతో నిండిన ఆ బావి అలనాటి వైభవాన్ని చాటుతోందన్నారు.
ఇవీ చదవండి: