ETV Bharat / state

ఆగని వైసీపీ నేతల వేధింపులు.. వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. వీడియో వైరల్​ - TDP activist Attempt suicide due to harass of YCP

Man Suicide Attempt: రాష్ట్రంలో వైసీపీ నాయకుల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. నిత్యం ఏదో ఒకచోట.. ఎవరో ఒకరు వీరి అరాచకాలకు బలవుతూనే ఉన్నారు. పోలీస్​ స్టేషన్లకు వెళ్లినా న్యాయం జరగక పోగా.. వాళ్లపైనే ఎదురు కేసులు పెట్టడం, వేధించడం లాంటి ఘటనలు జరుగుతున్నాయి. దీంతో కొంతమంది ఏం చేయాలో తెలియకు తనువు చాలిస్తున్నారు. ఇలాంటి ఘటనే ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర గ్రామంలో జరిగింది. కాగా యువకుడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.

Suicide Attempt
ఆత్మహత్యాయత్నం
author img

By

Published : Jan 30, 2023, 4:42 PM IST

Updated : Jan 30, 2023, 5:13 PM IST

Man Suicide Attempt: ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర గ్రామానికి చెందిన ఎర్ర గొర్ల విజయ్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కీసర గ్రామానికి చెందిన వైసీపీ నాయకుల వేధింపులు తట్టుకోలేక, కంచికచర్ల పోలీస్ స్టేషన్​లో విజయ్​తో పాటు ఆయన తమ్ముడు పైన రౌడీషీట్ ఓపెన్ చేయడంతో.. మనస్తాపానికి గురై పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కాగా వెంటనే నందిగామ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం మరో ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. ఆత్మహత్యాయత్నం చేసుకోవడానికి ముందు విజయ్ పురుగు మందు డబ్బా పట్టుకొని సెల్ఫీ వీడియో తీశాడు. దాన్ని సామాజిక మాధ్యమాల్లో పెట్టి అనంతరం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

గత మూడు నెలలుగా వైసీపీ నాయకుల ఆదేశాలతో కంచికచర్ల పోలీసులు అక్రమ కేసులు పెడుతూ ఉండటంతో మానసికంగా తీవ్ర మనస్థాపానికి గురైన ఆయన దీనికి పాల్పడ్డాడు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విజయ్ తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్త. ఈ కారణంతోనే ఆయన పైన అక్రమ కేసులతో వేధింపులకు పాల్పడుతున్నారు అని బంధువులు, కుటుంబ సభ్యులు ఆరోపించారు.

ఆగని వైసీపీ నేతల వేధింపులు.. వ్యక్తి ఆత్మహత్యాయత్నం..

నా పేరు ఎర్ర గొర్ల విజయ్.. మాది కీసర గ్రామం.. ఇవాళ కంచికచర్ల పోలీస్ స్టేషన్ నుంచి నాకు ఫోన్ రావడం జరిగింది. అది ఏంటంటే.. విజయ్ నీ మీద రౌడీ షీట్ ఓపెన్ చేశాము.. వచ్చి సంతకాలు పెట్టిపో అన్నారు. నా మీద రౌడీ షీట్ ఓపెన్ చేయటం ఏంటి సర్.. నేనేం తప్పు చేశాను, ఇదేంటి సర్ అని అంటే.. అరే బాబు నీ మీదే కాదురా.. నీ తమ్ముడి మీద కూడా ఓపెన్ చేశామన్నారు. నేను షాకయ్యాను.. ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు. ఫోన్ పెట్టేసిన తర్వాత ఇవాళ కంచికచర్ల పోలీస్ స్టేషన్​కి వెళ్లి అడిగితే.. సింపుల్​గా నీ మీద ఎస్సీ, ఎస్టీ కేసు అయిందని చెప్పారు.- విజయ్, బాధితుడు

ఇవీ చదవండి:

Last Updated : Jan 30, 2023, 5:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.