ETV Bharat / state

నకిలి పాస్​పోర్టు కేసు.. నలుగురు బంగ్లాదేశీయులకు జైలు శిక్ష - జైలు శిక్ష

Fake Pass Port: విజయవాడలో నకిలి పాస్​పోర్టు కేసులో నలుగురు బంగ్లాదేశ్​ జాతీయులకు విజయవాడ అదనపు జిల్లా న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. నకిలీ పాస్​పోర్టుతో బంగ్లాదేశ్​ నుంచి అక్రమంగా సరిహద్దులోకి ప్రవేశించారనే అభియోగంతో పోలీసులు విచారించగా.. నిజమని తేలటంతో న్యాయస్థానం జైలు శిక్ష విధించింది.

Four Members Jailed
నలుగురు బంగ్లాదేశీయులకు జైలు శిక్ష
author img

By

Published : Sep 30, 2022, 9:30 PM IST

Four Members Jailed in Fake Passport Case: నకిలీ పాస్​పోర్టు కేసులో నలుగురు బంగ్లాదేశీయులకు విజయవాడ అదనపు జిల్లా న్యాయస్థానం 14నెలల జైలు శిక్ష విధించింది. ఈ మేరకు విజయవాడ ఎనిమిదో అదనపు జిల్లా న్యాయస్థానం న్యాయమూర్తి డి. లక్ష్మి గురువారం తీర్పునిచ్చారు. విజయవాడ నగరంలోని సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న అప్పటి ఇంచార్జ్​ ఇన్​స్పెక్టర్ లక్ష్మీనారాయణకు వచ్చిన సమాచారం మేరకు.. సిబ్బందితో కలిసి 2021, జులై 2వ తేదీ రాత్రి విజయవాడ రైల్వేస్టేషన్​లో తనిఖీలు నిర్వహించారు.

హాన్హా- వాస్కోడిగామా రైలులో నలుగురు వ్యక్తులు పోలీసులకు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని విచారించగా అసలు విషయం బయటపడింది. నకిలీ పాస్​పోర్టుతో బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా సరిహద్దులోకి ప్రవేశించారని అభియోగంతో.. బంగ్లాదేశీయులైన మహ్మద్ హుస్సేన్ (33), హైదర్ అలీఖాన్ (37), ఇందా యాల్బాన్(21), సైపుల్లా షేక్ (25) లను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వారిని న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఈ కేసులో నలుగురు నిందితులపై నేరారోపణ రుజువు కావడంతో 14 నెలల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.