ETV Bharat / state

తుపాను సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలం - బాధితులకు పార్టీ శ్రేణులు అండగా ఉండాలి : చంద్రబాబు - Chandrababu Naidu updates

Chandrababu Naidu letter on Michaung Cyclone: రాష్ట్ర వ్యాప్తంగా మిగ్‌జాం తుపాను ప్రభావంతో అల్లాడుతున్న బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆహారం, నీళ్లు, షెల్టర్ ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. తుపాను కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం మరింత పెంచి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

cbn_letter_on_michaung_cyclone
cbn_letter_on_michaung_cyclone
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 5, 2023, 6:11 PM IST

Updated : Dec 6, 2023, 7:44 AM IST

Chandrababu Naidu letter on Michaung Cyclone: మిగ్‌జాం తుపాను బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆహారం, నీళ్లు, షెల్టర్ ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. తుపాను విషయంలో వైసీపీ ప్రభుత్వ సన్నద్ధత సన్నగిల్లిందని ఆయన ఆగ్రహించారు. జగన్ ప్రభుత్వం బాధితులకు సాయం కూడా చేయటం లేదని ధ్వజమెత్తారు. కష్టాల్లో ఉన్న ప్రజలకు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అండగా ఉండాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.

CBN Letter on Michaung Cyclone Victims: మిగ్‌జాం తుపాను ప్రభావంతో అల్లాడుతున్న బాధితులను జగన్ ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబు మంగళవారం ఓ లేఖ విడుదలు చేశారు. ఆ లేఖలో రాష్ట్ర ప్రభుత్వం తుపాను పట్ల వ్యవహరిస్తున్న తీరు, సన్నద్ధతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం తుపాను బాధితులకు భోజనం పెట్టలేదా? అని నిలదీశారు. హుద్ హుద్, తిత్లీ తుఫాన్ల సమయంలో తెలుగుదేశం ప్రభుత్వం చేసిన సాయం, అందించిన పరిహారం గురించి చంద్రబాబు వివరించారు.

విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబుకు భారీ ఊరట-సీఐడీ పీటీ వారెంట్లను తోసిపుచ్చిన కోర్టు

CBN Letter Details: ''మిగ్‌జాం తుపాను బాధిత ప్రజలకు తక్షణ అవసరాలైన ఆహారం, నీళ్లు, షెల్టర్ ఇవ్వడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యింది. అంతేకాదు తుపానుపై ప్రభుత్వ సన్నద్ధతా లేదు. బాధితులకు సాయం చేయటం లేదు. మిగ్‌జాం తుపాను బాధిత గ్రామాలకు చెందిన కొందరితో నేను ఫోన్‌లో మాట్లాడాను. ప్రభుత్వ సాయంపై ఆరా తీశాను. మాకు కనీసం భోజనం కూడా పెట్టడంలేదని, ప్రభుత్వం సరిగా స్పందించటంలేదని వారు ఆవేదన చెందారు.'' అని చంద్రబాబు పేర్కొన్నారు.

CBN on Hud Hud, Thitli Cyclone: హుద్ హుద్, తిత్లీ తుపాన్ల సమయంలో తెలుగుదేశం ప్రభుత్వం ప్రత్యేక జీవోలతో సాయం అందించిందని చంద్రబాబు నాయుడు లేఖలో వెల్లడించారు. విపత్తుల సమయంలో రైతులను ఆదుకోవడానికి టీడీపీ ప్రభుత్వం ఆనాడు ప్రత్యేక సాయం అందించిందన్నారు. హుద్ హుద్ సమయంలో జీవో నెంబర్ 9 ద్వారా, తిత్లీ తుఫాన్ సమయంలో జీవో నెంబర్ 14 ద్వారా నష్ట పరిహారం పెంచి, రైతులకు అండగా నిలబడ్డామన్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం లెక్కలు వేసుకోకుండా ఉదారంగా వ్యవహరించామని చంద్రబాబు తెలిపారు. నాటితో పోల్చుకుంటే నేడు పెరిగిన సాగు ఖర్చులు, ఇతర భారాలను దృష్టిలో పెట్టుకుని వైసీపీ ప్రభుత్వం పరిహారం మరింత పెంచి, రైతులకు నష్ట పరిహారం ఇవ్వాలని చంద్రబాబు లేఖలో డిమాండ్ చేశారు.

CBN Letter to Union Minister: అటవీ భూములు అన్యాక్రాంతం.. కేంద్రమంత్రికి చంద్రబాబు లేఖ

CBN Teleconference With Party Workers: మిగ్‌జాం తుపాను ప్రభావంపై చంద్రబాబు నాయుడు 12వేల మంది పార్టీ నేతలు, కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల పరిస్థితులపై నాయకులతో సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం క్షేత్ర స్థాయిలో ఉన్న నాయకులు గ్రామాల్లో నివసిస్తున్న ప్రజల బాగోగులను చూసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వం సాయం కోసం ఎదురు చూడకుండా పార్టీ నాయకులు, కార్యకర్తలు బాధిత ప్రజలకు అండగా ఉండాలి అని చంద్రబాబు సూచించారు.

''అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం పని చేస్తుంది. ఈ కష్ట సమయంలో చేతనైన సాయం ద్వారా ప్రజలకు అండగా నిలవండి. ఈ ప్రభుత్వం మాటలు కోటలు దాటుతున్నా చేతలు గడప దాటడం లేదు. దీనికి క్షేత్రస్థాయి పరిస్థితులే నిదర్శనం. ఈ స్థాయి విపత్తు అని ముందే తెలిసినా ప్రజలను అలెర్ట్ చేయడంలో జగన్ ప్రభుత్వం ఘోరంగా విఫలం అయ్యింది. వ్యవస్థల నిర్వీర్యం వల్లనే నేడు ఈ దుస్థితి నెలకొంది'' - చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ అధినేత

CBN Letter to CM: చించినాడలో దళితులపై పోలీసులు దాడి.. సీఎం జగన్‌కు చంద్రబాబు లేఖ

Last Updated : Dec 6, 2023, 7:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.