APNGO election nominations: ఏపీఎన్జీవో సంఘం ఎన్నికల్లో విద్యాసాగర్, మహ్మద్ ఇక్బాల్ ప్యానెల్ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమం విజయవాడలో అట్టహాసంగా నిర్వహించారు. పాత బస్టాండ్ వద్ద నుంచి ఎన్జీవో హోమ్ వరకు ఉద్యోగులు పెన్షనర్లతో ర్యాలీగా బయలుదేరివెళ్లారు. విద్యాసాగర్ ప్యానెల్ అభ్యర్థులు ఎన్జీవో హోమ్‌లో నామినేషన్ దాఖలు చేశారు. ఉద్యోగుల సమస్యలపై ఏపీ ఎన్జీవో సంఘం నిరంతరం పోరాటం చేస్తుందని విద్యాసాగర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయుల పట్ల కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నూతన కార్యవర్గం ఉద్యోగ ,ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని అన్నారు.
ఇవీ చదవండి: