ETV Bharat / state

సిమెంట్ పరిశ్రమలో ప్రమాదం.. ఇద్దరు మృతి - Accident in Ramco

Ramco Cement: నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల రామ్‌కో సిమెంట్ పరిశ్రమలో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలు దుర్మరణం పాలైయ్యారు. ఈనెల 28న ఈ పరిశ్రమను సీఎం జగన్ ప్రారంభించాల్సి ఉంది. ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందడంతో తోటి కార్మికులు నిరసనకు దిగారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

Ramco Cement
సిమెంట్ పరిశ్రమలో ప్రమాదం
author img

By

Published : Sep 25, 2022, 3:51 PM IST

Accident in Ramco Cement : నంద్యాల జిల్లా కొలిమి గుండ్ల సమీపంలోని రాంకో సిమెంటు పరిశ్రమలో ప్రమాదం జరిగింది. వెల్డింగ్ పనిచేస్తూ ప్రమాదవశాత్తు పైనుంచి కిందపడి పశ్చిమ బంగాల్ ​కు చెందిన రహీం (26 )సుమన్ (23) ఇద్దరు యవకులు మరణించారు. బతుకుదెరువు కోసం వచ్చి మృతి చెందడంతో పరిశ్రమలోపని చేస్తున్న కార్మికులు ఆందోళన చెపట్టారు.

ఈ నెల 28న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈ పరిశ్రమను ప్రారంభించాల్సిఉంది. ముఖ్యమంత్రి రాక సందర్భంగా ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రమాదం చోటుచేసుకున్నట్లు కార్మికులు చెబుతున్నారు. ప్రమాదంలో ఇద్దరు యువకులు చనిపోవడంతో పరిశ్రమ వద్దకు పెద్ద సంఖ్యలో పోలీసులు చేరుకున్నారు. మృతదేహాలను బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో పరిశ్రమ ఆవరణలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కొలిమిగుండ్ల పోలీసులు వెల్లడించారు.

Accident in Ramco cement industry

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.