ETV Bharat / state

రెండేళ్లలో పునాదులు దాటని ఆదోని మెడికల్ కాలేజీ నిర్మాణం..

ADONI MEDICAL COLLEGE: తమ ప్రాంతానికి మెడికల్ కళాశాల వస్తోందంటే స్థానిక ప్రజలు ఎంతో సంతోషించారు. సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తామంటే ఇంకా ఆనందించారు. కాలం గడుస్తున్నా పనులు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారింది. ఈ పరిస్థితుల్లో అసలు కళాశాల పూర్తవుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ADONI MEDICAL COLLEGE
ఆదోని మెడికల్ కళాశాల
author img

By

Published : Jan 30, 2023, 8:30 AM IST

ADONI MEDICAL COLLEGE: కర్నూలు జిల్లా కేంద్రానికి ఆదోని పట్టణం వంద కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతంలో ఏవైనా ప్రమాదాలు జరిగినా అత్యవసర వైద్య సేవలు కావాలన్నా కర్నూలు వెళ్లాల్సి వస్తోంది. లేదంటే బళ్లారి, రాయచూర్ వెళ్లాల్సి ఉంటుంది. ఆదోని పట్టణంలోనే మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తే ఆలూరు, ఆదోని, కోసిగి, కౌతాళం, పత్తికొండ, ఏమ్మిగనూరు, మంత్రాలయం తదితర ప్రాంతాల ప్రజలకు ఎంతో దగ్గరగా ఉంటుంది. మెరుగైన సేవలు పొందటానికి వీలుగా ఉంటుంది. 2021 మే 31న రాష్ట్ర వ్యాప్తంగా 14 మెడికల్‌ కళాశాలలకు వర్చువల్ విధానంలో సీఎం జగన్‌ శంకుస్థాపన చేశారు. ఇందులో ఆదోనిలో సైతం మెడికల్ కళాశాల ఉండటంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. కానీ ప్రస్తుత పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది.

రెండేళ్లైనా..పునాది దాటలేదు: ఆదోని శివారులో ఎమ్మిగనూరు వెళ్లే మార్గంలో మెడికల్ కాలేజీ పనులకు శ్రీకారం చుట్టారు. 58 ఎకరాల విస్తీర్ణంలో వంద మెడికల్ సీట్లు, 450 పడకల సామర్థ్యంతో 475 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తామని ప్రకటించారు. సుమారు రెండేళ్లు కావస్తున్నా ఇంతవరకూ పనులు పునాదులు దాటలేదు. 2023 చివరి నాటికి మెడికల్ కాలేజీని అందుబాటులోకి తీసుకు వస్తామని ప్రభుత్వం అట్టహాసంగా ప్రకటించింది. ప్రస్తుతం పనులు జరుగుతున్న తీరును చూస్తే మరో మూడేళ్లు పట్టేలా ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఎన్నికల్లో ఓట్ల కోసం: కళాశాల నిర్మాణం కోసం రైతుల దగ్గర తీసుకున్న భూములకు పరిహారం చెల్లింపు కూడా ఇంకా పూర్తిస్థాయిలో చేయలేదంటున్న స్థానికులు వచ్చే ఎన్నికల్లో ఓట్ల కోసం కాకుండా చిత్తశుద్ధితో నిర్మాణాన్ని పూర్తిచేయాలని కోరుతున్నారు.

స్థానికుల డిమాండ్: నీటి సమస్య సహా నిధుల కొరత కారణంగానే మెడికల్ కళాశాల పనులు మందకొడిగా సాగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. సాధ్యమైనంత త్వరగా పనలు పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

ఆదోని మెడికల్ కాలేజీ నిర్మాణం

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.