కర్నూలులో వైకాపా నేతలు సంబరాలు చేసుకున్నారు. జిల్లాకు నాలుగు బీసీ కార్పొరేషన్లు కేటాయించడంతో జిల్లా నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు నగరంలోని వైఎస్సార్ విగ్రహానికి, ముఖ్యమంత్రి చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి మాట్లాడుతూ..బీసీలకు ప్రస్తుత ప్రభుత్వంలో పూర్తిగా న్యాయం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, కొడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ పాల్గొన్నారు.
ఇదీ చదవండి