కర్నూలు నగర జనాభా సుమారు 7 లక్షలు. సాధారణ రోజుల్లో తాగునీటికి పెద్దగా ఇబ్బంది లేకపోయినా.. వేసవిలో సమస్య తీవ్రమవుతోంది. సుంకేసుల జలాశయంలో నీటి నిల్వలు పడిపోవటం, వర్షాలు ఆలస్యంగా కురవడం, అవసరాలకు సరిపడా సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు సామర్థ్యం లేకపోవటం వంటి కారణాలతో నీటి ఎద్దడి ఏర్పడుతోంది. కర్నూలు నగరపాలక సంస్థ అప్రమత్తమై.. సమస్యలు పునరావృతం కాకుండా పరిష్కార మార్గాన్ని కనుగొంది.
సుంకేసుల నుంచి 20 కిలోమీటర్ల మేర కాల్వ ద్వారా నీటిని తరలించే క్రమంలో.. నీరు ఆవిరైపోవడం, కొన్నిచోట్ల ఇష్టానుసారంగా లాగేసుకోవడం వల్ల 66 శాతం నీరు వృథా అవుతోందని నగరపాలక సంస్థ కమిషనర్ డీకే బాలాజీ అన్నారు. దీనిని అరికట్టేందుకు 82 కోట్ల వ్యయంతో సుంకేసుల నుంచి ట్యాంక్ వరకు పైపులైను ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు తెలిపారు.
ఇవీ చూడండి...: టైరు పగిలి ఆర్టీసీ బస్సు బోల్తా... ప్రయాణికులు సురక్షితం