కాచిగూడ నుంచి డోన్‌కు వెళ్తున్న లోకోమోటివ్ రైలు ఇంజిన్ శుక్రవారం రాత్రి పట్టాలు తప్పింది. కర్నూలు నగర పరిధిలోని కేసీ కాల్వ దాటిన తర్వాత ఈ ఘటన జరిగింది. ఇంజిన్ నెమ్మదిగా వెళ్తున్న వేళ ప్రమాదం జరగడంతో పెద్ద ముప్పు తప్పింది. ఘటనకుగల కారణాలను హైదరాబాద్ డివిజినల్ మేనేజర్‌తో కూడిన నిపుణుల బృందం అన్వేషించాలని అధికారులు చెప్పారు.
ఆ తర్వాతే రైళ్ల రాకపోకలను అనుమతించాల్సి ఉన్న కారణంగా.. కొన్ని రైళ్లు ఆలస్యంగా తిరగనున్నాయని కర్నూలు రైల్వే అధికారులు పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే వారు హైదరాబాద్ డివిజన్ కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. ఈ ఘటనతో కాచిగూడ నుంచి వెళ్లే చెన్నై ఎగ్మోర్, గుంటూరు రైళ్లను గద్వాల స్టేషన్‌లో నిలిపివేశారు. డోన్ మీదుగా వెళ్లే కాచిగూడ రైలు సైతం ఆలస్యంగా నడిచింది.
ఇదీ చదవండి: