కర్నూలులో అధికార పార్టీ నాయకుల మధ్య వర్గపోరు మరోసారి భయటపడింది. కర్నూలును న్యాయ రాజధానిగా ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ నగరంలో వైకాపా నాయకులు సంబరాలు జరుపుకున్నారు. వైఎస్ఆర్ కూడలి వద్దకు కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ తన అనుచరులతో రాగా అదే సమయానికి మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి తన అనుచరులతో అక్కడికి వచ్చారు. ఎన్నికల అనంతరం ఎస్వీ మోహన్ రెడ్డి, హఫీజ్ ఖాన్ల మద్య వర్గపోరు నడుస్తోంది. ఈ క్రమంలో ఇద్దరు నాయకులు ఒకే సమయంలో రావడంతో వారివారి అనుచరులు.. వారికి అనుకూలంగా నినాదాలు చేశారు.
ఇవీ చదవండి