భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వకుండా అనర్హులకు పరిహారం ఇవ్వడం తగదని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి మండిపడ్డారు. నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందించి ఆదుకోవాలని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో డిమాండ్ చేశారు. ప్రభుత్వం సున్నా వడ్డీ పేరిట కొందరికి 30, 60 రూపాయలు ఖాతాలో వేసి మోసం చేసిందన్నారు. సున్నా వడ్డీ అంటూ లక్ష రూపాయల లోపు అప్పున్న రైతులకు వడ్డీ వేసి మిగతా రైతులను దగా చేసిందని విమర్శించారు.
ఇవీ చూడండి...