శ్రీశైలంలో ప్రారంభమైన సంక్రాంతి బ్రహ్మోత్సవాలు - Sankranti Brahmotsavas news in Srisailam
కర్నూలు జిల్లాలోని శ్రీశైల మహాక్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ఈవో దంపతులు, అర్చకులు, వేదపండితులు యాగశాల ప్రవేశం చేసి ప్రారంభ పూజలు నిర్వహించారు. చండీశ్వరునికి విశేష పూజలు నిర్వహించి కంకణధారణ చేశారు. అర్చకులకు ఈవో దీక్షా వస్త్రాలు అందజేశారు.