నల్లమల అడవుల్లో అరుదైన సర్పం(snake) తారసపడింది. శ్రీశైలం పాతాళ గంగ మార్గంలోని ఆంజనేయ స్వామి ఆలయం వద్ద సంచరిస్తున్న ఎల్లో గ్రీన్ క్రాట్ పాము(yellow green crat snake)ను అటవీశాఖ అధికారులు గుర్తించారు. స్నేక్ క్యాచర్(snake catcher) కాళీ చరణ్ ఎల్లో గ్రీన్ సర్పాన్ని చాకచక్యంగా పట్టుకున్నారు. ఇది చెట్టిరి(chettiri)కి జాతికి చెందినదిగా అధికారులు తెలిపారు. ఎల్లో గ్రీన్ క్రాట్ సర్పం 1913లో నెల్లూరు జిల్లా ఉదయగిరిలో కనిపించిందని.... ఆ తర్వాత ఈ రకం సర్పం ఎక్కడా కనిపించలేదన్నారు. ఈ పాము కరిచినా పెద్దగా ప్రమాదం ఉండదని, కొంచెం మైకంగా మాత్రమే ఉంటుందని తెలిపారు.
ఇదీచదవండి.