పేద అగ్రవర్ణాలకు కేంద్రం కల్పించిన 10శాతం రిజర్వేషన్ను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని కోరుతూ కర్నూలులో ఓసీ జేఏసీ నేతలు నిరాహార దీక్ష చేపట్టారు. బ్రాహ్మణ, ఆర్యవైశ్య, రెడ్డి, కమ్మ, కాపు, బలిజ కులస్థులు ఓసీ జేఏసీగా ఏర్పడి కొన్ని రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. అగ్రవర్ణాల్లో చాలా మంది పేదలు ఉన్నారని వారికి రిజర్వేషన్లు లేనందునా విద్యా, ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్ వేంటనే రాష్ట్రంలోని అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరారు.
ఇదీ చదవండి: అమ్మవారికి నగలిచ్చి.. తిరిగి వెనక్కి తీసుకున్న దాత!