ETV Bharat / state

కాచిగూడ వద్ద రైళ్లు ఢీ... 12 మందికి గాయాలు

author img

By

Published : Nov 11, 2019, 2:56 PM IST

Updated : Nov 11, 2019, 4:04 PM IST

హైదరాబాద్​ కాచిగూడ రైల్వే స్టేషన్​లో రైలు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న కర్నూలు ఇంటర్​ సిటీ ఎక్స్​ప్రెస్​ను ఎంఎంటీఎస్​​ రైలు​ ఢీ కొట్టింది. ఈ ఘటనలో 12 మందికి గాయాలయ్యాయి. సిగ్నల్​ లోపం వల్లే ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.

కాచిగూడ వద్ద రైలు ఢీ... 12మందికి గాయాలు

కాచిగూడ వద్ద రైళ్లు ఢీ... 12మందికి గాయాలు

తెలంగాణలోని హైదరాబాద్​ కాచిగూడ రైల్వే స్టేషన్​ వద్ద తృటిలో పెను ప్రమాదం తప్పింది. మలక్‌పేట నుంచి వస్తున్న ఎంఎంటీఎస్‌ రైలు, స్టేషన్‌లో ఆగివున్న కర్నూలు ఇంటర్​ సిటీఎక్స్‌ప్రెస్‌(హంద్రీ ఎక్స్‌ప్రెస్‌)ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో 12 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న సమాచారం అందుకున్న రైల్వే శాఖ అధికారులు, సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఉస్మానియా, కిమ్స్​ ఆస్పత్రులకు తరలించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనలో ఎంఎంటీఎస్​ రైలు డ్రైవర్​ చంద్రశేఖర్​ క్యాబిన్​లో చిక్కుకున్నాడు. అతన్ని బయటకు తీసేందుకు నాలుగు గంటలుగా ఎన్డీఆర్​ఎప్​ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. గ్యాస్​ కట్టర్​తో కేబిన్​ను కత్తిరిస్తున్నారు. లోకోపైలెట్​కు ప్రాణాపాయం కలగకుండా వైద్యులు ఆక్సిజన్​, సెలైన్​ అందిస్తున్నారు. ఇంటర్​ సిటీ ఎక్స్​ప్రెస్​ లోకోపైలెట్​ రక్తనమూనాలనూ వైద్యాధికారులు సేకరించారు.

మానవ తప్పిదమే

ప్రమాదంతో ఎంఎంటీఎస్‌లోని ప్రయాణికులంతా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఒక ట్రాక్‌పై రైలు నిలిచి ఉన్నప్పుడు మరో రైలుకు సిగ్నల్‌ ఎలా ఇస్తారని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన కారణంగా ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. మానవ తప్పిదం వల్లే ప్రమాదం జరిగినట్లు రైల్వే అధికారులు ప్రాథమిక నిర్ధరణకు వచ్చారు. సిగ్నల్​ వ్యవస్థలో లోపం వల్లే ఘటన జరిగినట్లు పోలీసు ఉన్నతాధికారి రమేశ్​ తెలిపారు.

ఇదీ చూడండి:

ఆస్ట్రేలియాలో కార్చిచ్చుకు భారత్​లో వర్షాలే కారణమట!

Last Updated : Nov 11, 2019, 4:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.