కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మార్కెట్ యార్డులో మెుక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఎనిమిది వేల హెక్టార్లలో మొక్కజొన్న సాగు చేశారని, ప్రతి రైతు వద్ద నుంచి ఎకరాకు 17 క్వింటాళ్ల చొప్పున పంట దిగుబడులను మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. ఈ కొనుగోలు డిసెంబర్ నెలాఖరు వరకు కొనసాగిస్తామన్నారు. క్వింటాలుకు రూ.1850 చొప్పున కొనుగోలు చేస్తామని..ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కొనుగోలుకు సంబంధించి రైతులు తమ పంటలను ఈ క్రాపింగ్‌లో నమోదు చేసుకొని ఉండాలని అన్నారు.
ఇదీ చదవండి