ETV Bharat / state

కరోనా కొమ్ములు వంచుతున్నారు..!

కరోనా కొమ్ములను అధికార యంత్రాంగం వంచుతోంది. ఒకవైపు కేసులను కట్టడి చేయడంతోపాటు, మరోవైపు బాధితులు పూర్తిగా కోలుకునేలా రెవెన్యూ, పోలీసు, వైద్య, ఆరోగ్య, పురపాలక ఇలా అన్ని శాఖల అధికారులు పూర్తిగా శ్రమిస్తున్నారు. రాష్ట్రంలోనే అత్యధిక కేసులు, మరణాలతో ముందున్న కందనవోలులో కోలుకునేవారి సంఖ్యా అధికంగా ఉండటంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. మరోవైపు మరణాల రేటును తగ్గించాలని కోరుకుంటున్నారు.

kurnool district corona cases
కర్నూలు జిల్లాలో కరోనా కేసులు
author img

By

Published : May 17, 2020, 4:02 PM IST

కర్నూలు జిల్లాలో నమోదవుతున్న పాజిటివ్ కేసులతోపాటు.. కోలుకునే వారి సంఖ్యా అధికంగానే ఉంటోంది. కర్నూలు, నంద్యాల ప్రాంతాలను దిల్లీ కేసులు వెంటాడుతుంటే.. వారం క్రితం కేసులే లేని ఆదోని డివిజన్‌ను ప్రస్తుతం కోయంబేడు కేసులు వణికిస్తున్నాయి. జిల్లాలో శనివారం కొత్తగా 9 కేసులు నమోదయ్యాయి. వాటిలో కర్నూలులో 4 ఉండగా, ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య 386కు చేరింది.

నంద్యాలలో ఒక కొత్త కేసుతో మొత్తం కేసులు 115కు చేరాయి. ఎమ్మిగనూరుకు చెందిన డ్రైవరు గత నెలలో కోయంబేడుకు వెళ్లి రావటంతో క్వారంటైన్‌లో ఉన్నారు. ఆయనకు పాజిటివ్‌ వచ్చింది. కోస్గికి చెందిన ఇద్దరు వాహనచోదకులు కోయంబేడుకు ఉల్లిగడ్డల లోడ్‌ తీసుకెళ్లగా, వారిద్దరికి వైరస్‌ సోకినట్లు నిర్ధరణ అయింది. వారిని క్వారంటైన్‌ నుంచే కొవిడ్‌ ఆసుపత్రికి తరలించారు.

కౌతాళానికి చెందిన ఓ డ్రైవరు ఉల్లిపాయల లోడ్‌ తీసుకెళ్లగా అతడికి పాజిటివ్‌ వచ్చింది. ఎమ్మిగనూరు, కోస్గి, కౌతాళం ఇప్పటివరకు ఆరెంజ్‌ జోన్‌లో ఉన్నాయి. ఈ 3 ప్రాంతాల్లో కోయంబేడు కేసులు నమోదు కావడం, ఈ కేసుల సంఖ్య 9కు చేరడం జిల్లా యంత్రాంగాన్ని కలవర పెడుతోంది.

జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 608కు చేరింది. కర్నూలుకు చెందిన మరో వ్యక్తి మరణంతో జిల్లాలో కొవిడ్‌ బారిన పడి మృతిచెందిన వారి సంఖ్య 19కి చేరుకుంది. ఇప్పటివరకు కర్నూలు నగరానికి చెందినవారు 17 మంది, నంద్యాల, పాణ్యం ప్రాంతాలకు చెందిన వారు ఒక్కొక్కరు కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.

15 మంది డిశ్చార్జి

జిల్లాలో వివిధ ఆసుపత్రుల్లో కరోనా నుంచి కోలుకుని శనివారం 15 మంది డిశ్చార్జి అయ్యారని కలెక్టర్‌ వీరపాండియన్‌ తెలిపారు. కర్నూలు చైతన్య కళాశాల కొవిడ్‌ కేంద్రం నుంచి ఆరుగురు, నంద్యాల కొవిడ్‌ ఆసుపత్రి నుంచి ఇద్దరు, విశ్వభారతి ఆసుపత్రి నుంచి ఆరుగురు, సర్వజన వైద్యశాల నుంచి ఒకరు ఉన్నారు.

సరకు ఎగుమతి.. వైరస్‌ దిగుమతి

కోయంబేడు మార్కెటుకు వెళ్లి వచ్చిన వారిలో కరోనా లక్షణాలు బయటపడటంతో జిల్లాలో కలకలం రేగుతోంది. 20 ఏళ్లుగా రైతులు ఉల్లిని విక్రయించేందుకు జిల్లా నుంచి తమిళనాడులోని కోయంబేడు మార్కెట్‌కు వెళ్తున్నారు. అక్కడ ధర అధికంగా ఉండటం, దళారులతో సంబంధం లేకుండా నేరుగా అమ్ముకునే అవకాశం ఉండటంతో రైతులు ఎక్కువగా అక్కడికే ఉల్లిని తరలిస్తుంటారు.

జిల్లాలో ఉల్లిసాగు ఆయా సీజన్లలో మొత్తం 34 వేల హెక్టార్లలో సాగవుతోంది. ఇందులో డోన్‌, ప్యాపిలి, గోనెగండ్ల, కోస్గి, ఆదోని, ఎమ్మిగనూరు, కోడుమూరు, కౌతాళం తదితర మండలాల్లోనే అధికం. హెక్టారుకు సరాసరి 10 నుంచి 15 టన్నుల వరకు దిగుబడులు వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఉల్లి ధర ఇక్కడ క్వింటా రూ.600 వరకు ఉంటే కోయంబేడులో క్వింటా రూ.900 నుంచి రూ.వేయి వరకు ఉంటుందని, రవాణా ఖర్చులు పోనూ క్వింటాకు రూ.200 నుంచి 300 వరకు మిగులుతుందని అందుకే అక్కడికి తరలిస్తున్నట్లు రైతులు చెబుతున్నారు.

రైతులు లారీల్లో సరకు తీసుకెళ్లి, అక్కడి మార్కెట్లో అమ్మకం అయ్యాకా, తిరిగి రైళ్లలో ఊళ్లకు చేరేవారు. ఇందుకు చెన్నై నుంచి జిల్లాకు అనువైన బస్సు మార్గంతోపాటు, రైలు మార్గం ఉంది. ఆదోని మీదుగా రోజుకు అయిదారు రైళ్లు, కర్నూలు మీదుగా 2 రైళ్లు ఉన్నాయి. ఇక పక్కనే గుత్తి, గుంతకల్లు రైల్వే జంక్షన్లు ఉండటం కర్షకుల ప్రయాణానికి కలిసి వస్తోంది. కరోనా నేపథ్యంలో మే 5వ తేదీ నుంచి మార్కెట్‌ను శాశ్వతంగా మూసివేశారు. అయినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

ఇవీ చదవండి... కర్నూలులో మరో 3 కరోనా పాజిటివ్ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.