కర్నూలు జిల్లా శ్రీశైలంలో వెలసిన శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి... అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి బంగారు ఖడ్గం సమర్పించారు. 235 గ్రాములతో తయారు చేసిన ఈ ఖడ్గానికి... ఇరు వైపులా సింహ లలాటాలు, రెండు తెలుపు రాళ్లు, పచ్చ రాళ్లను పొదిగించారు. ఈ ఖడ్గాన్ని ఆలయ ఈవో రామారావుకు అందజేశారు. అనంతరం వేద పండితులు స్వామి అమ్మవార్ల శేష వస్త్రాలు, ప్రసాదాలను అందించారు. ఖడ్గం విలువ 9 లక్షల 45 వేల రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: మట్టి వినాయకుడిని పూజిద్దాం..ప్రకృతిని కాపాడుదాం!