తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన కర్నూలుకు చెందిన పదో తరగతి విద్యార్థిని అత్యాచారం, హత్యకేసు దర్యాప్తులో అదనపు సెక్షన్లు జోడిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఈ కేసును సీబీఐ దర్యాప్తునకు అప్పగించిన ప్రభుత్వం... నిందితులపై మోపేందుకు అదనపు సెక్షన్లు జోడించింది.
కర్నూలు తాలుకా పోలీసు స్టేషన్లో నమోదైన ఈ కేసులో ఐపీసీ సెక్షన్లు 302, 201, 34తో పాటు ఎస్సీ, ఎస్టీ చట్టం, పోక్సో చట్టం కింద కూడా వివిధ సెక్షన్లు జోడిస్తూ సవరణ నోటిఫికేషన్ జారీ చేసింది. 2017లో కర్నూలులోని ఓ రెసిడెన్షియల్ పాఠశాలలోని పదో తరగతి విద్యార్థి అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. ఆమె కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఈ ఏడాది ఫిబ్రవరిలో పవన్ కల్యాణ్ కర్నూలులో ర్యాలీ నిర్వహించారు. బాలికపై అత్యాచారం, హత్య కేసును ఫిబ్రవరిలో రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ దర్యాప్తునకు అప్పగించింది.
ఇదీ చదవండి