కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి ప్రవహించాయి. వక్కెరవాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో రాకపోకలు అంతరాయం ఏర్పడింది. గోనెగండ్ల మండలంలోని గాజులదిన్నె ప్రాజెక్టు (సంజీవయ్య సాగర్)కు భారీగా నీరు వచ్చి చేరుతోంది. ఇప్పటికే జలాశయంలోకి 60 వేల క్యూసెక్కుల నీరు వచ్చిచేరగా.... రిజర్వాయర్లోని 4 గేట్లు ఎత్తి దిగువకు తుంగభద్ర నదిలోకి 40 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. తీర ప్రాంతం గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. గంజహల్లి వద్ద వంక ఉధ్దృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి.
ఇదీ చూడండి. కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు