కర్నూలు జిల్లా బేతంచెర్ల మండలం ఆర్ఎస్ రంగాపురం గ్రామ సమీపంలోని శ్రీ లక్ష్మీ మద్దిలేటి స్వామి ఆలయ పరిసరాల్లో భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి పెద్ద కోనేరు నుండి వర్షపు నీరు పొంగి పోర్లడంతో ఆలయం గుడి మెట్లను వరద నీరు తాకింది. పెద్ద కోనేరు, చిన్న కోనేరు, సుడిగుండం పూర్తిగా జలమయమయ్యాయి. ఇలా వర్షపు నీరు దేవాలయంలోని మెట్లను తాకడం, ఇది రెండో సారి అని ఆలయ అర్చకులు, సిబ్బంది తెలిపారు. అయితే... రేపు అమ్మ వారి నూతన ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ జరగనుండగా... ఇలా వర్షపు నీరు ఆలయ మెట్లను తాకడం శుభసూచికమేనని ఆలయ అర్చకులు పేర్కొన్నారు.
ఇవీ చూడండి:దేశంలో 24 గంటల్లో 10,956 కేసులు, 396 మరణాలు