కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మున్సిపల్ ఛైర్మన్ రఘు.. తన తల్లి, మున్సిపల్ కౌన్సిలర్ అయిన సరోజమ్మపై దౌర్జన్యానికి పాల్పడిన దృశ్యాలు.. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ విషయంలో రఘుపై ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మున్సిపల్ ఛైర్మన్ రఘుకు, తన తల్లిదండ్రులు, సోదరుడితో.. ఆస్తి వివాదాలున్నట్లు తెలుస్తోంది.
ఛైర్మన్ తమను ఇబ్బంది పెడుతున్నాడని ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం న్యాయమూర్తిని కలిసి అర్జీ ఇచ్చారు. తమపై పెద్ద కుమారుడు ఛైర్మన్ రఘు భార్య కలిసి ఆస్తి కోసం వేధిస్తున్నారని తనపై దాడి కూడ జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తల్లిపై.. రఘు దౌర్జన్యానికి పాల్పడ్డ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
ఇదీ చదవండి:
నాది అధికార పార్టీ.. నా ట్రాక్టర్నే సీజ్ చేస్తారా?? పోలీస్ స్టేషన్లో వ్యక్తి హల్ చల్!