శ్రీశైలం జలాశయానికి భారీ వరద ప్రవాహం కొనసాగింది. వరద ప్రవాహం పెరగడంతో గత వారం రోజుల నుంచి జలాశయం గేట్లను పైకెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో శ్రీశైలం జలాశయం దిగువ భాగాన ఉన్న లింగాల గట్టు గ్రామం వద్ద మత్స్యకారుల వలలో అరుదైన చేపలు చిక్కుతున్నాయి. తాజాగా కృష్ణా నదిలో 40 నుంచి 50 కేజీల బరువైన భారీ చేప మత్స్యకారుల వలలో చిక్కింది. 4 అడుగుల పొడవు కలిగిన ఈ భారీ చేపను పందుగ అని పిలుస్తారని మత్స్యకారులు చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో ఈ స్థాయి చేప దొరకడం ఇదే తొలిసారి. శ్రీశైలం జలాశయానికి వరద పెరగడంతో మత్స్యకారులు చేపలు అధికంగా పడుతున్నారు.
ఇదీ చదవండి: అభ్యంతరాలున్నా హెటిరోకు భూములు!