కృష్ణా జిల్లా తిరువూరు మండలం కొమ్మిరెడ్డిపల్లిలో ఓ యువకుడు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందాడు. గ్రామానికి చెందిన కోట హరీష్(20) పొలం పనికి వెళ్లి దాహం తీర్చుకునేందుకు సమీపంలోని బావి వద్దకు వెళ్లాడు. కాలు జారి ప్రమాదవశాత్తు బావిలో పడి ప్రాణాలు కోల్పోయాడు. ఎంతకూ ఇంటికి రాకపోవటంతో కుటుంబ సభ్యులు గాలించగా.. బావిలో శవమై కనిపించాడు. గ్రామస్థులు అతికష్టం మీద మృతదేహాన్ని బయటకు తీసి.. ఇంటికి చేర్చారు.
ఇదీ చదవండి..