కృష్ణా జిల్లా పామర్రులో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో అధికారులు ఆ ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించారు. ప్రజలందరూ మాస్కులు ధరిస్తూ, భౌతిక దూరం పాటించాలని సూచించారు. అయితే వైకాపా నాయకులు మాత్రం నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించారు.
మార్కెట్ యార్డు నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఆర్భాటంగా నిర్వహించారు. భారీ ఎత్తున ర్యాలీ చేసి, మాస్కులు లేకుండా, గుంపులుగా ఫొటోలు దిగారు. నాయకులు, కార్యకర్తలు ఏ మాత్రం కొవిడ్ నిబంధనలు పట్టించుకోలేదు. సామాన్యులకే కానీ అధికార పార్టీ నేతలకు నిబంధనలు వర్తించవా అంటూ పలువురు ప్రశ్నించారు.
ఇవీ చదవండి...