ఇదీ చదవండి : రాఘవాచారి మృతి పట్ల సీఎం సహా ప్రముఖుల సంతాపం
ఇసుక కొరతను తీర్చాలంటూ... కార్మికుల ఆందోళన - latest news of sand problems in AP
ఇసుక కొరతను తీర్చాలంటూ నందిగామ తహశీల్దారు కార్యాలయం ఎదుట కార్మికులు ఆందోళనకు దిగారు. ఉపాధి లేక నష్టపోయిన ప్రతి ఒక్క కార్మికుడికి నెలకు 10 వేల చొప్పున ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు
workers-protest-at-nandigam-mro-office-over-sand-problem-in-state
ఇసుక కొరతను తీర్చాలని కోరుతూ కృష్ణాజిల్లాలోని నందిగామ తహశీల్దారు కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఇసుక కొరత వల్ల గత మూడు నెలలుగా తమకు పనులు లేకుండా పోయాయని కార్మికులు ఆందోళనకు దిగారు. రోజువారీ జీవనం కష్టతరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్క భవన నిర్మాణ కార్మికుడికి నెలకు 10 వేల చొప్పున పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. ఇసుకను అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి : రాఘవాచారి మృతి పట్ల సీఎం సహా ప్రముఖుల సంతాపం
sample description