ఇసుక అక్రమ రవాణా కేసులో తన కుమారుడిని అన్యాయంగా ఇరికించారని ఆరోపిస్తూ... కృష్ణా జిల్లా షేర్ మహమ్మద్పేటలో ఓ మహిళ నిరసన వ్యక్తం చేసింది. గ్రామ సమీపంలో ఇసుక డంపింగ్ యార్డు ఏర్పాటు చేసి... వైకాపా నాయకులు వ్యాపారం చేస్తున్నారని ఆ మహిళ ఆరోపించారు. వైకాపా నేతలు ఇసుకను తరలిస్తూ... తన కుమారుడిని అక్రమంగా అరెస్టు చేయించారని ఆరోపించారు. అక్రమ రవాణాకు పాల్పడిన ప్రధాన నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు... విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇవ్వటంతో... ఆందోళన విరమించారు.
ఇదీచదవండి...