ETV Bharat / state

న్యాయం కోసం ఏపీ సీడ్స్ సంస్థ ఎదుట మహిళ ఆందోళన

ఏపీ సీడ్స్​ కార్పొరేషన్ సంస్ధలో ఉద్యోగిగా పని చేస్తున్న తన భర్త అబ్జుల్ అజీజ్ తనను వదిలించుకోవాలని చూస్తున్నారని భార్య.. విజయవాడలో ఆందోళనకు దిగింది. తనకు న్యాయం చేయాలని అధికారులను కోరింది.

AP Seeds company headquarters
ఏపీ సీడ్స్ సంస్థ ప్రధాన కార్యాలయం ఎదుట మహిళ ఆందోళన
author img

By

Published : Apr 13, 2021, 4:34 PM IST

విజయవాడలో ఏపి సీడ్స్ సంస్ధ ఎదుట వివాహిత కుటుంబ సభ్యులతో కలిసి నిరసన చేపట్టింది. శ్రీకాకుళం జిల్లా ఏపీ సీడ్స్​ సంస్ధలో పని చేస్తున్న అబ్దుల్ అజీజ్ తనను వదిలించుకోవాలని చూస్తున్నారని ఆజీజ్ భార్య ఆరోపించింది. ఎస్​.కె. నజీరాతో 2007లో అజీజ్​కు వివాహం జరిగింది. అనంతరం పశ్చిమగోదావరి జిల్లా తణుకులో నివాసం ఉండేవారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. నాలుగేళ్ల క్రితం తండ్రి ఉద్యోగం అజీజ్​కి రావటంతో.. కుటుంబ సభ్యులు శ్రీకాకుళానికి వెళ్లిపోయారు.

గత కొద్ది రోజుల నుంచి వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని.. తనను చిత్రహింసలు పెడుతున్నారని నజీరా ఆవేదన వ్యక్తం చేసింది. తన మానసిక పరిస్థితి బాగాలేదని.. 15 రోజులు క్రితం ఆసుపత్రిలో జాయిన్ చేసి వెళ్లిపోయాడని.. తిరిగి రాకపోవటంతో పోలీసులను ఆశ్రయించామని కుటుంబ సభ్యులు తెలిపారు. ఏపీ సీడ్స్ సంస్థ ప్రధాన కార్యాలయం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే.. న్యాయం జరుగుతుందన్న ఆశతో నిరసన చేపట్టామని కుటుంబ సభ్యులు వెల్లడించారు.

ఇవీ చూడండి...

పాఠాలు చెబుతూనే.. ప్రాణాలు విడిచిన ఉపాధ్యాయిని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.